తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామన్నారు. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామని అలాగే, అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు.