సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడిదారులు చిన్న మొత్తాలను పెట్టుబడి పెడుతూ సంపదను కూడబెడతారు. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)లో పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ నుంచి క్రమం తప్పకుండా స్థిర మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. నెలనెలా నగదు అవసరమైన వారికి, పదవీ విరమణ చేసిన వారికి SWP మంచి పథకం. SWPలో పోర్ట్‌పోలియో నుంచి డబ్బును ఉపసంహరించుకున్న తర్వాత కూడా మిగిలిన మొత్తం పెరుగుతూనే ఉంటుంది.