పేరులో ‘స్వస్తిక’ ఉన్నందుకు మహిళపై ఉబర్ నిషేధం!

54చూసినవారు
పేరులో ‘స్వస్తిక’ ఉన్నందుకు మహిళపై ఉబర్ నిషేధం!
ఆస్ట్రేలియాలో ఉబర్ కంపెనీ వివాదంలో చిక్కుకుంది. స్వస్తిక చంద్ర అనే మహిళ గతేడాది అక్టోబర్‌లో ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమె పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించిన ఉబర్ మహిళ ఖాతాను నిషేధించింది. బాధితురాలు సుమారు 5 నెలల పాటు సంస్థతో పోరాడింది. చివరగా, హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా జోక్యం చేసుకోవడంతో ఉబర్ దిగివచ్చింది. ఆమె స్వస్తికకు క్షమాపణలు చెప్పి, ఇకపై ఇలా జరగదని హామీ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్