ఉక్రెయిన్ సైనికులు కుర్స్క్ ప్రాంతంలోని రష్యా పట్టణం సుడ్జాను స్వాధీనం చేసుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురువారం తెలిపారు. సుమారు 5,000 మంది జనాభా ఉన్న సుడ్జాలో ఉక్రేనియన్ మిలిటరీ కమాండర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, గతంలో రష్యా ఎయిర్ బేస్‌లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది.