ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్‌లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు కొలువుతీరనున్నాయి.