కన్వర్ యాత్ర సాగే రూట్‌లో దుకాణాల నేమ్‌బోర్డులపై యజమానుల పేర్లు ఉండాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ వ్యవహరంపై విపక్షాలు యోగి సర్కార్‌పై విరుచుకుపడుతుండగా.. తాజాగా ఆర్జేడీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సమాజంలో శాంతి, సామరస్యం దెబ్బతినేలా ఇలాంటి నిర్ణయం తీసుకోరాదని, కన్వర్ యాత్రకు వెళ్లే ప్రజలు, వారికి సేవలు అందించే వారంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు.