ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య (వీడియో)

36099చూసినవారు
యూపీలోని కాన్పూర్ దేహత్‌ శివలి పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా విషాద ఘటన జరిగింది. మదన్ రాథోడ్ అనే యువకుడు 16 ఏళ్ల దళిత బాలికను ప్రేమించాడు. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక పేరెంట్స్ మదన్‌పై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో మదన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి ఇటీవల మదన్ విడుదలయ్యాడు. పేరెంట్స్ తమ ప్రేమను అంగీకరించలేదని ఇద్దరూ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.