సోయా నూనెను వంటల్లో వాడుతున్నారా? జాగ్రత్త!

1827చూసినవారు
సోయా నూనెను వంటల్లో వాడుతున్నారా? జాగ్రత్త!
సోయా నూనె వాడకం ఆరోగ్యానికి హానికారమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పూనంజోత్ డియోల్ వెల్లడించారు. సోయాబీన్‌ నూనెలోని లైనోలిక్ ఆమ్లం వల్ల పెద్దపేగుకు వాపు ఏర్పడి పుండు పడుతుంది. సోయా నూనె ద్వారా రోజుకు 8-10 శాతం శక్తిని లైనోలిక్ ఆమ్లం ద్వారా పొందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ ఆమ్లం ద్వారా ప్లేగుల్లో మంచి బ్యాక్టీరియాలు నశించి ఈ-కోలి అనే హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల విషపదార్థాలు రక్తంలో కలిసి ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్