పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై నిర్మాత రవిశంకర్ క్రేజీ అప్‌డేట్ అందించారు. 'ఇటీవలే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఉస్తాద్ భగత్ షూట్ కొన్ని వారాల్లో మొదలుపెడతాము. మొత్తం షూట్ డిసెంబర్ లేదా జనవరి కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తాము' అని ఆయన తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.