ఉత్తుత్తి బెదిరింపులకు బెదరను: ఒవైసీ

62చూసినవారు
ఉత్తుత్తి బెదిరింపులకు బెదరను: ఒవైసీ
పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ 'ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు' అని వ్యాఖ్యానించారు. 'వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయనీయండి. నాకు రాజ్యాంగం అంటే ఎంతో కొంత తెలుసు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులకు భయపడేది లేదు' అని ఒవైసీ స్పందించారు.

సంబంధిత పోస్ట్