వంశీ అనుచరుడు రంగాకు ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌

55చూసినవారు
వంశీ అనుచరుడు రంగాకు ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌
AP: గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకు విజయవాడ కోర్టు ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌ విధించింది. బుధవారం విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. పోలీసులు అతన్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తొలుత గన్నవరం ఠాణాకు, తర్వాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్