మోనితకి వారణాసి వార్నింగ్.. మళ్లీ డాక్టర్ గా కార్తీక్?

15888చూసినవారు
మోనితకి వారణాసి వార్నింగ్.. మళ్లీ డాక్టర్ గా కార్తీక్?
కార్తీక దీపం 1241వ ఎపిసోడ్‌ లో దీప కోసం కార్తీక్ ఊరంతా వెతుకుతాడు. ఇక కార్తీక్ ఫొటో పట్టుకుని మహేష్ అదే రోడ్లపై తిరుగుతుంటాడు. కానీ కార్తీక్, మహేష్‌లు ఎదురుపడరు. మహేష్ ఆ ఊరు వదిలి వెళ్తూ ‘ఇక్కడ కూడా వీళ్లు దొరకలేదు.. ఇంకెంత కాలం వెతకాలో’ అనుకుంటాడు.

మరోవైపు.. కార్తీక్ ఇంటికి వచ్చేసరికి బాబుకి జ్వరం వస్తుంది. దాంతో తడి గుడ్డతో బాబు శరీరాన్ని తుడుస్తూ ఉంటాడు. చాలాసేపటికి దీప వస్తుంది. దీపని పట్టుకుని ఏం అయ్యిపోయావ్ దీపా.. ఆ రుద్రాణీ నిన్ను ఏం చేసిందోనని.. అంటూ కంగారుపడుతూ రుద్రాణి చేసిందంతా చెబుతాడు. పిల్లలకు అన్నం తినిపించబోతే వెళ్లి ఆపిన విషయంతో సహా అంతా చెబుతాడు. పిల్లలు కూడా చెబుతారు. దాంతో దీప కాస్త నవ్వి ‘ఏం ఆలోచించొద్దు’ అని సద్దిచెబుతుంది.

దీప బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను అని తీసుకుని బయలుదేరుతుంది. వెంటనే కార్తీక్ ఓ పేపర్ మీద బాబుకి కావాల్సిన మందులు రాసి ఇస్తాడు. దీప చాలా సంతోషిస్తుంది. కార్తీక్ ఆ ఊరిలో డాక్టర్‌గా మారబోతున్నాడని కొన్ని సీన్లు చూస్తే అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ‘ఊరిలో సరైన డాక్టర్ లేడు’ అనే మాట కార్తీక్ విన్నాడు. దాన్ని సింక్ చేసుకుంటే ఈ ఊరిలో కార్తీక్ డాక్టర్‌గా వైద్యం మొదలుపెడతాడేమో.. పూర్వవైభోగం వస్తుందేమో అనిపిస్తోంది.

మరోవైపు మోనిత బస్తీలో ఉన్న తన ఇల్లు మొత్తం నరసమ్మ కోసం వెతుకుతుంది. ఆమె ఎక్కడ కనిపించకపోగా.. వారణాసి చేతులు కట్టుకుని మోనితవైపే పొగరుగా చూస్తూ ఓ గుమ్మవైపు కనిపిస్తాడు. ఇక మీ దగ్గర పని చేయడానికి ఎవ్వరూ రారు. ఈ బస్తీ వాళ్ల గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు.. మా గుండెల్లో దీపక్క ఉంది. త్వరలో చూస్తారు మేడమ్.. మేమంటే ఏంటో త్వరలోనే చూపిస్తాం.. వస్తా మేడమ్.. నమస్తే’ అంటూ మోనితకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్