మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన 15వ మూవీని ప్రకటించారు. ఈ మూవీని 'VT 15' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.