రిషికి షాకిచ్చిన వసు, మహేంద్ర

16934చూసినవారు
రిషికి షాకిచ్చిన వసు, మహేంద్ర
స్టార్ మా లో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' 398వ ఎపిసోడ్‌ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వసు ఇంటికి వెళ్లి కంగారుగా తలుపు తీస్తుంది. ఎదురుగా జగతి బిందాస్‌గా కాఫీ తాగుతూ పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆమెను చూసి వసు షాక్ అవుతుంది. రిషి కాలేజ్ ఎండీ. తనకు నచ్చింది తను చేశాడు. అందుకుని బాధపడుతూ కూర్చోవాలా? అని జగతి అంటుంది. మహేంద్రకు కాల్ చేయమని చెబుతుంది. ఈ రోజు రుచికరమైన వంటకాలన్నీ చేస్తానని చెబుతుంది. మహేంద్ర కూడా జగతి తీరును చూసి వసులానే షాక్ అవుతాడు. జగతి మనసులో బాధని పెట్టుకుని పైకి నవ్వుతూ నటిస్తోందని అంటాడు. అయితే జగతి మాత్రం నిజంగానే బాధపడదు. రిషి ఇలా చెయ్యడానికి కారణం ఎవరో తెలుస్తూనే ఉంది కదా అని నవ్వుతూ చెబుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ తన ఐడియాను వసు, మహేంద్రలకు చెబుతుంది. ఐడియా విన్న వసు, మహేంద్రలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ షాక్ అవుతారు. జగతి అక్కడ నుంచి వంట చేస్తానంటూ వెళ్లిపోతుంది.

రిషి తన ఇంటికి బాధగా వెళ్తాడు. అతడిని గౌతమ్ పలకరిస్తారు. రిషి ‘తర్వాత మాట్లాడుకుందామా’ అనేసి వెళ్లిపోతాడు. రిషి సాయంత్రం వసు రెస్టారెంట్‌కి వెళ్తాడు. వసు రిషితో చాలా కూల్‌గా మాట్లాడుతుంది. ఆర్డర్ ఇవ్వద్దు, నేనే మీకోసం నాకు నచ్చింది తీసుకొస్తానంటూ వెళ్లి స్వీట్ తెస్తుంది. ‘ఐస్ క్రీమ్, కాఫీ రెండూ తెప్పిస్తుంది. ఎదురుగా పెట్టి.. తీసుకోండి సార్.. ఈ రోజు మీకు అన్నీ ఫ్రీనే.. ఇది నా పార్టీ’ అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది. దీంతో రిషి షాక్ అవుతాడు. తన మాటలకు వసు హర్ట్ అయ్యి ఉంటుందేమోనని, కూల్ చేద్దామని వస్తే.. ఇదేంటి ఇంత కూల్‌గా మాట్లాడుతుంది? అని రిషి మనసులో అనుకుంటాడు. మీ జగతి మేడమ్ అని ఏదో మాట్లాడబోతున్న రిషితో ‘సార్ ఎప్పుడూ మేడమ్ విషయమేనా? వదిలెయ్యండి సార్. హ్యాపీగా తినండి. ఇప్పుడే వస్తాను’ అని వసు వెళ్లిపోతుంది. రిషికి ఏం అర్థం కాదు.

కమింగ్ అప్‌లో రిషి వసుతో చాటింగ్ చేస్తాడు. 'ఈరోజు ఉత్సాహంగా ఉన్నావు ఎందుకో తెలుసుకోవచ్చా’ అని మెసేజ్ చేస్తాడు. ‘ఉత్సాహంగా ఉండటం మంచిదే కదా సార్’ అని వసు రిప్లై ఇస్తుంది. గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే.. కాలేజ్‌లో మహేంద్ర రిషితో సీరియస్‌గా గొడవ పడతాడు. జగతి మీద కోపంతో నిర్ణయాలు తీసుకోవడం నచ్చలేదని అంటాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ మహేంద్ర లెటర్ ను రిషి చేతిలో పెడతాడు. రిషి షాక్ అవుతాడు. తర్వాత ఏం జరగనుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

సంబంధిత పోస్ట్