ఏప్రిల్‌‌లో 27 శాతం పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు: ఫాడా

68చూసినవారు
ఏప్రిల్‌‌లో 27 శాతం పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు: ఫాడా
దేశంలో వాహన రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌‌లో 27% పెరిగి 22,06,070కి చేరాయని పరిశ్రమ సమాఖ్య ఫాడా వెల్లడించింది. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్రవాహనాలతోపాటు అన్ని విభాగాల్లో వృద్ధినమోదైందని పేర్కొంది. 2023 ఏప్రిల్‌‌లో రిటైల్ విక్రయాలు 17,40,649గా ఉన్నాయి. సానుకూల మార్కెట్ సెంటిమెంట్, స్థిరమైన ఇంధన ధరలు, అనుకూల రుతుపవనాల అంచనాలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వంటివి గిరాకీ పెరిగేందుకు దోహదంచేశాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్