దాడిలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటిని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పరిశీలించారు. ఆయన కేసు ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ముంబై అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది. అలాగే ఆయన దాదాపు 80 మందిని ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.