VIDEO:పడవ మునక.. MLAకు తప్పిన ప్రమాదం

61చూసినవారు
భారీ వర్షాల వల్ల అస్సాంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో MLA సుశాంత బోర్గోహైన్ మరికొందరితో కలిసి వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో నితైపుఖురిలోని రాజబరి బర్పత్తర్ వద్ద వరద నీటిలో వారి పడవ బోల్తా పడింది. ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి, అనేక గ్రామాలను ముంచెత్తింది.

సంబంధిత పోస్ట్