ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వచ్చిన అభయ్ సింగ్ అనే ఓ బాబా అందరినీ ఆకర్షించారు. ఆయన ఐఐటీ బాంబేలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తరువాత కెనడాలో ఏడాదికి రూ.36 లక్షల ప్యాకేజీకి జాబ్ చేశారు. 4 ఏళ్ళు ఓ యువతితో ప్రేమలో ఉండగా ఆమె మోసం చేసి వదిలేసింది. దీంతో ఆయన మద్యానికి బానిసయ్యాడు. తన పేరెంట్స్తరచూ గొడవ పడటంతో వివాహంపై నమ్మకం కోల్పోయి ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనశ్శాంతి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.