అస్సాంలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందుల గురించి రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు ఊహించని అనుభవం ఎదురైంది. నది పక్కనే నిల్చుని ప్రజలతో మాట్లాడుతున్న ఆ జర్నలిస్టు పట్టుతప్పి నదిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఆ జర్నలిస్టుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.