జమ్ముకశ్మీర్‌లోని కాట్రా మాతా వైష్ణో దేవి ఆలయ మార్గంలో రాళ్లు, కొండచరియలు విరిగి పడ్డాయని శ్రీమాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో తెలిపారు. ఆలయ విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని సీఈవో పేర్కొన్నారు. కొండచరియలు విరిగి పడిన ఘటనలో పలువురు భక్తులు చిక్కుకున్నారని వార్తా కథనాలు తెలిపాయి. ఇద్దరు మహిళలు మరణించారని, ఒక బాలిక గాయపడిందని ఓ అధికారి పీటీఐతో చెప్పారు.