గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ సింహం అడవి నుంచి రైల్వే ట్రాక్‌పై వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ గార్డ్ ఆవును తరిమినట్లు ఒక చిన్న కర్ర తీసుకుని బయటకు పంపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు సింహాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.