మధ్యప్రదేశ్‌లోని సీఎం రైజ్ స్కూల్‌లో భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన భార్య తన భర్తను చితక్కొట్టింది. ఈ స్కూల్‌లో పనిచేస్తున్న వ్యక్తి తన భార్య, బిడ్డలను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అతడి భార్య అతడిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.