AP: హీరో మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో జరిగే జల్లికట్టులో పాల్గొన్నారు. మొదట ఆయన మోహన్ బాబు విద్యానికేతన్ విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సి ఉండగా పోలీసులు పర్మిషన్ లేదని చెప్పారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు మనోజ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన రంగంపేటలో జరిగే జల్లికట్టులో భార్య మౌనికతో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.