జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లోని ఒక పత్తి పొలంలో శుక్రవారం కలుపు తీసేందుకు వచ్చిన కూలీలకు సుమారు 2 క్వింటాళ్ల బరువు ఉన్న భారీ మొసలి కనిపించింది. అధికారులు వచ్చి మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అది పొలంలోని బావిలో దూకింది. అందులో నీరు నిండుగా ఉండడంతో వల విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించినా చిక్కలేదు. బావిలోని నీటిని ఇంజిన్లతో బయటకు తోడి మొసలిని బంధించారు. ఈ మొసలిని జూరాల జలాశయంలో వదిలారు.