పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ సందడి చేశారు. స్టేజి ఎక్కి క్యూట్ గా మాట్లాడారు. అల్లు అర్జున్ తనయుడు అయాన్ మాట్లాడుతూ.. నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటాది. తగ్గేదెలే అని అన్నాడు. ఇక కూతురు అర్హ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం అని చెప్పి.. 'అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ' తెలుగు పద్యం స్టేజిపై ఈజీగా చెప్పేసింది.