VIDEO:వ్యక్తిని తొక్కుకుంటూ పోయిన RTC బస్సు

70చూసినవారు
మహారాష్ట్రలోని పుణె జిల్లా భోర్ తాలూకాలో సోమవారం మధ్యాహ్నం విషాద ఘటన జరిగింది. రూపేష్ గైక్వాడ్ అనే వ్యక్తి కాలికి గాయమైంది. దీంతో ఆయన కుంటుకుంటూ నడుస్తున్నాడు. బస్సు వద్ద రూపేష్ కొద్ది సేపు ఆగాడు. ఆ సమయంలో రూపేష్‌ను MSRTC బస్సు డ్రైవర్ గమనించలేదు. బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు చక్రాల కింద నలిగి రూపేష్ చనిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్