గుజరాత్‌లోని వడోదరలో ఆగస్టు 11న షాకింగ్ ఘటన జరిగింది. అక్కాచెల్లెళ్లు స్కూటర్‌పై వెళ్తున్నారు. వారి స్కూటర్‌ను ఓ మలుపు వద్ద ట్రక్కు ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్కూటర్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు కింద నలిగి అక్కాచెల్లెళ్లలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. ఇక మృతి చెందిన మహిళకు అమెరికా వీసా వచ్చింది. నెల రోజుల్లో అమెరికాకు ఆమె వెళ్లనున్న తరుణంలో ప్రమాదంలో చనిపోయింది.