బెంగళూరులో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మూఢనమ్మకం వల్ల తన ఇంటిని కోల్పోయాడు. తన ఇంటికి వాస్తు దోషం ఉందని ఒక పండితుడు చెప్పాడు. ఇంటి నుంచి ఒక పిల్లర్ తొలగిస్తే.. నీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది తెలిపాడు. దీంతో ఇంటి యజమాని పండితుడు చెప్పినట్టు ఒక పిల్లర్ ను తొలగించాడు. ఈ క్రమంలో బిల్డింగ్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో సదరు యజమాని రోడ్డుమీద పడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.