ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మహాకుంభమేళాకు వెళ్లిన భక్తుల్లో చాలా మంది అక్కడి నుంచి నేరుగా కాశీకి తరలి వెళ్తున్నారు. దాంతో కాశీలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కాశీ నగర వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం కాశీ విశ్వనాథుడి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అధికారులు కాశీలో హైఅలర్ట్ ప్రకటించారు.