అనుమానంతో భార్యను బాత్‌రూంలోనే కొట్టి చంపిన భర్త

72చూసినవారు
అనుమానంతో భార్యను బాత్‌రూంలోనే కొట్టి చంపిన భర్త
TG: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ భర్త రోజు గొడవ పడేవాడు. శనివారం రాత్రి కూడా అదే విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో భార్య ఆదివారం ఉదయం 3.30 గంటలకు బాత్‌రూమ్‌లోకి వెళ్లగా అనుమానంతో పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్