సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం దగ్గరకు వెళ్ళింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చూసేందుకు యువతి సాహసం చేసి మరీ పర్వతం ఎక్కింది. దీనిలో ఒక అమ్మాయి డుకోనో అగ్నిపర్వతం దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. క్లిప్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఈ అమ్మాయి చర్య మూర్ఖత్వానికి పరాకాష్ట అని అంటున్నారు.