విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ కూడలినుంచి వనస్థలిపురం వరకు రోడ్డుపై పలు అభివృద్ధి పనులు జరుగుతున్నవి.ఇందులో భాగంగా వనస్థలిపురం పల్లవి గార్డెన్ సమీపంలో ఓపెన్ బాక్స్ డ్రైన్ పనులు జరుగుతున్నవి. వర్క్ జరుగుతున్న స్థలంలో ఎటువంటి ప్రమాద సూచిక బోర్డులు కానీ,బారీ కేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.