కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండలంలో ఆదివారం ఉదయం నుంచి బస్సులు సమయపాలన పాటించకపోవడం వలన ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రయాణికులు వాపోయారు. మద్దూరు మండల కేంద్రానికి రెండు డిపోలో బస్సులు రావలసి ఉండగా ఎందుకు రావడం లేదని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులు వచ్చేటట్లు చూడాలని వారు కోరుతున్నారు