మా స్వంత జిల్లాలకు మమ్ముల పంపండి అని బషీరాబాద్ మండల పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఉపాధ్యాయులు మంగళవారం భోజన విరామ సమయంలో బషీరాబాద్ అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్థానికత కు గొడ్డలి పెట్టులాంటి 317 జీఓ వచ్చి నేటికి సంవత్సరం అయిన సందర్భంగా ఈ నిరసన చేపట్టము అన్నారు . తమ స్థానికత తమ కుటుంబాలు ఉన్న జిల్లాలకు తమను పంపాలి ఆని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సొంత జిల్లా సాధించే వరకు ఐక్యంగా పోరాడతాము ఆని నినాదం ఇచారు .
కాగ పల్లె పల్లె కు పైలట్ కార్యక్రమం లో బాగంగా బషీరబాద్ మండలములో పర్యటిస్తున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి తమ సొంత జిల్లా లకు పంపాలని పలువురు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు చెరుకూరి మధు, రాంరెడ్డి, ప్రతాప్, విజయ తదితరులు ఉన్నారు.