సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

85చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
పరిగి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొంది వారి గ్రామాలకు వచ్చిన తర్వాత ఆసుపత్రి ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ వన్ అధ్యక్షులు పార్థసారథి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.