పరిగి మున్సిపాలిటీలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో రోడ్డు సౌకర్యం లేకుండా, స్ట్రీట్ లైట్ వెలగకుండా అత్యంత దారుణంగా ఉందని కాలనీవాసులు తెలిపారు. మండల కేంద్రములో ప్రధాన గ్యాస్ ఆఫీసుకు వెళ్లే దారి అది. నిత్యం వందల వాహనాలు ఈదారి వెంబడే తిరుగుతుంటాయి. కానీ చినుకు పడితే చిత్తడే. గత 15రోజుల నుండి వీధిదీపాలు వెలుగక కాలనీవాసులు చీకటిలో మగ్గుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.