వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాల్మిక్ అధికారి లయన్ హరినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ఆధార్ కార్డుతో రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.