వికారాబాద్ జిల్లా పరిగిలో అక్రమంగా తరలిస్తున్న 6000 లీటర్ల డిజిల్ మిని ట్యాంకర్ ను పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు. కర్ణాటక రాష్ట్రం ముదేళ్లి నుంచి ప్రతి రోజు హైదరాబాద్ కు తరలిస్తున్నారని పక్క సమాచారంతో పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ కు పెట్రోల్ డీజిల్ తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.