ప్రతి విద్యార్థికి పునాది అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం అందరికీ రావాలి అన్నారు. తాండూర్ మండలం పునాది అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం నోడల్ ఆఫీసర్ మృత్యుంజయ స్వామి. బుధవారం ఆయన తాండూర్ మండలంలోనీ నారాయణ పూర్, వీర్ శెట్టి పల్లి, గోనుర్ పాఠశాలలను అయాన సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరును, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి విద్యార్థికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం ఉంటే పై తరగతులలో రాణిస్తారు అని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.