తాండూర్ మున్సిపల్ పరిధిలోని వినాయక చౌక్ లో యుటియఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకొని, ఉద్యమ సంఘము బలపర్చిన నన్ను గేలిపిస్తే ఉపాధ్యాయ సంక్షేమానికి, విద్యావికాసానికి తోడ్పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, కార్యదర్శి బందెప్ప, మీడియా కన్వీనర్ గోపాల్, తాండూర్ ప్రాంత యుటియఫ్ నేతలు నర్సింహులు, నారాయణగౌడ్, వెంకటప్ప , తిరుపతి తదితరులు ఉన్నారు.