వికారాబాద్ జిల్లా దుద్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాగుకు యోగ్యం కాని భూముల సర్వే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దుద్యాలలోని 191 సర్వే నంబర్లో సాగుకు యోగ్యం కాని భూమిని తహశీల్దార్ కిషన్ నాయక్, ఏవో హిమబిందు పరిశీలించారు. రైస్ మిల్లులు, ప్లాట్ల విక్రయాల కోసం సిద్ధం చేసిన వెంచర్లు, మైనింగ్, వాటర్ ప్లాంట్ వంటి నిర్మాణాలను గుర్తించి రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్నారు.