విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ‘తంగలాన్’. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్, మాళవిక తదితరులు విజయవాడ, గుంటూరులో సందడి చేశారు. గుంటూరు వీవీఐటీ విద్యార్థులతో కలిసి విక్రమ్ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది.