బాల్యవివాహాలతో (18 ఏళ్ల కంటే తక్కువ వయసులో పెళ్లి వల్ల) తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని, హింస ముప్పును పెంచుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే.. అసమానతలు తలెత్తుతాయని తెలిపింది. అమ్మాయిలు ఆర్థికంగా భర్తలపై ఆధారపడాల్సి రావడంతో వారు సమాజంలో ఒంటరివారవుతారని, ఫలితంగా వారిపై వేధింపులు పెరిగే ముప్పుంటుందని పేర్కొంది.