దేశాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకే ఓటు వేశా: జేపీ నడ్డా

52చూసినవారు
దేశాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకే ఓటు వేశా: జేపీ నడ్డా
హిమాచల్‌ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్‌ను మరింత పటిష్టంగా, స్వావలంబనగా మార్చేందుకే తాను ఓటు వేశానని అన్నారు. ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశ భవిష్యత్తు గురించి ప్రజలు ఆశాజనకంగా ఉన్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్ల మార్కును దాటుతుంది’ అని నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్