మిరప పంట సాగు చేయాలనుకుంటున్నారా?

67చూసినవారు
మిరప పంట సాగు చేయాలనుకుంటున్నారా?
మిరపను రైతులు ఎర్రబంగారంగా పిలిచుకుంటారు. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే సంపద కుడా ఆ స్థాయిలో ఉంటుంది. మిరప పంటకు ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరోట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియ దున్నాలి. దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 2-౩ సార్లు దున్నుకొని, మొక్కలు నాటుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్