Oct 23, 2024, 03:10 IST/
బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి(వీడియో)
Oct 23, 2024, 03:10 IST
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఓ బిల్డింగ్ కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో భవనం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.