గొర్లవీడు గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి

72చూసినవారు
గొర్లవీడు గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి
గొర్లవీడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ దాశరధి రామాలయంతో పాటు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదయ్య, భాస్కర్ నాయక్, రవీందర్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్