
హనుమకొండ: ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఢీ.. 20 మందికి గాయాలు
హనుమకొండ జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. క్ష్తతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.