నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మైదం యాకన్న కుటుంబానికి కొమ్ములవంచ హెల్పింగ్ హాండ్స్ గ్రూపు తరపున మంగళవారం 75 కేజీల బియ్యం, 5 కేజీల వంటనూనె అందించారు. గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పృథ్వి, రాంబాబు, అశోక్, షఫీ, సైదులు, కరుణాకర్, రాజు ఉపేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.