మరిపెడ గెస్ట్ హౌస్ లో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ని యు ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లులు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. రాజకీయాలకి అతీతంగా, పారదర్శకంగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని వారు ఎమ్మెల్యేని కోరారు.